సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ద్రోణి విస్తరించింది. ఈ నేపథ్యంలో కోస్తా ఆంధ్ర ప్రదేశ్ అంతటా గత రాత్రి నుండి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. భీమవరంలో గత అర్ధరాత్రి నుండి ప్రారంభమైన వర్షాలు నేటి గురువారం రాత్రి వరకు కొనసాగే సూచనలు కనపడుతున్నాయి. నేటి ఉదయం 8 గంటల సమయం లో ఒక్క గంట మాత్రమే వర్షపు జోరు కాస్త తగ్గింది. మార్కెట్ అంతటా బయటకు వచ్చేవారు లేక నిస్తేజంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది.
