సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గత 5 రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. అయితే వాతావరణ కేంద్రం తాజా ప్రకటన ప్రకారం.. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై, మీదుగా వాయుగుండము కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైఋతి/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి.. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో నేడు,- మంగళవారం, రేపు ఎల్లుండి ,బుధవారం, గురువారంలలో ఒక మోస్తరు వర్షము కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *