సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలం లో దేశీయ స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా లేదు. తాజగా నేడు, సోమవారం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ ఘోరంగా పడిపోవడం కూడా స్టాక్‌మార్కెట్‌ను వెనక్కి లాగింది. అలాగే గరిష్టాల వద్ద పలు సెక్టార్లలో లాభాల స్వీకరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి. (stock market).గత శుక్రవారం సెషన్ ముగింపు (85, 231)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు వంద పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత చివరి గంటలో నష్టాల్లోకి జారుకుంది. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాలతో రోజును ముగించాయి. చివరకు సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టంతో 84, 900 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 108 పాయింట్ల నష్టంతో 25, 959 వద్ద స్థిరపడింది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 194 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.23గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *