సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం డాలర్‌తో పోల్చుకుంటే భారతీయ రూపాయి మారకం విలువ (రూ.89.76) రికార్డు కనిష్టానికి పడిపోవడం స్టాక్ మార్కెట్ ఫై తీవ్ర ప్రభావం చూపింది. నేటి ఉదయం నుండి భారీగా లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నేల చూపులు చూశాయి.క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా సూచీలనునష్టాల వైపు లాగాయి. (Indian stock) గత వారం సెషన్ ముగింపు (85, 706)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు కుదించుకొనిపోయి చివరకు సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 85, 641 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే చివరకు 27 పాయింట్ల నష్టంతో 26, 751 కు చేరుకొంది. బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.76గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *