సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 14 రోజులలో పాన్ వరల్డ్ స్టార్ గా భీమవరం బ్రాండ్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల సినిమా వస్తుందని అభిమానులు అంచనాను కల్కి తాజాగా నిజం చేసాడు. ఇప్పటికి కల్కి కలెక్షన్స్ స్పీడ్ చూస్తుంటే అవలీలగా మరో 300 కోట్ల పైగా వసూళ్లు సాధించే దిశగా కనపడుతుంది. ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి బాహుబలి 2 RRR తరువాత మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి కల్కి చాటాడు. ప్రభాస్, తో పాటు బిగ్ బి అమితాబ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పురాణాల్లోని కర్ణుడు , అర్జునుడు, అశ్వథామ వంటి పాత్రలను తీసుకొని, దానికి ఫాంటసీ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తయారు చేసాడు. మరి కల్కి సీక్వల్ లో మహాభారత యుద్ధం మరింత హైలైట్స్ గా కమల్ హాసన్ తో పాటు హీరో నాని కూడా కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి 2898 ఏడీ 3వ సినిమా.. గతంలో ఆలిండియా రికార్డ్స్ ను బ్రద్దలు కొట్టిన , బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, RRR (2022) తాజగా కల్కి 1000 కోట్లు + విజయయాత్ర కొనసాగిస్తుంది.
