సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ నేడు, గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌కాలేజీ గ్రౌండ్‌లో ఎంపీ మార్గాన్ని భరత్ సమక్షంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. అక్కడ నుండి జూమ్ యాప్ ద్వారా తూర్పుగోదావరి, అంబే డ్కర్ కోనసీమ జిలా,కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని జాతీయ రహదారులలో మొత్తం ఐదు ఫ్లైవోవర్లు, మూడు జాతీయ రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని, రాష్ట్ర ప్రభుత్వం కు అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని, నేడు ప్రారంభించిన ఈ కోస్త జిల్లాలలో రహదారుల పనులు పూర్తీ చెయ్యడానికి రూ.2,850 కోట్ల ఈ పనులు కేటాయింపులు జరిగాయని మరల వచ్చే 3 నెలలలో సుమారు 3000 కోట్ల రూపాయలు ఏపీలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాజమండ్రి- కాకినాడ కెనాల్ కు కేంద్ర అనుమతి ఇస్తామని , విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఒరిస్సా లోని భువనేశ్వర్ నుండి ఏపీలోని భోగాపురం వరకు 6 వే రోడ్డులు నిర్మిస్తామని ప్రకటించారు. గడ్కరీ కడి యం వెళ్లి నర్సరీలు సందర్శించారు. . దీంతో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ కె.మాధవీలత పర్యవేక్షించారు.
