సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం త్యాగరాజు భవనంలో ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో నిర్వహించబడుతున్నశ్రీమాత వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీ దేవి’ అలంకారణ చేశారు. ఈ అవతారం కోసం సుమారు రూ 3 కోట్ల కొత్త నోట్ల కరెన్సీ తో ప్రత్యేక అలంకరణ అద్భుతంగ చేశారు. శ్రీ అమ్మవారితో పాటు పంక్షన్ హాలులో కూడా భారీగా పూలమాలల మాదిరి కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేసిన అలంకరణలు భక్తులను అలరించాయి. కొత్త కరెన్సీ లోకంలో నడుస్తున్న అనుభూతి భక్తులకు కలిగింది. పలువురు ప్రముఖులు తో పాటు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *