సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, మంగళవారం వీరవాసరం మండలం నందమూరి గురువు, మడుగు పోలవరం, మత్స్యపూరి పాలెంలో సుమారు రూ 52 లక్షలతో రోడ్డు పనులకు, మత్స్యపూరిపాలెంలో రూ 40 లక్షలతో మైక్రో పిల్టర్ వాటర్ ట్యాంకు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాలు సుందరీకరణంగా మారుతున్నాయంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో సర్పంచులకు గౌరవం పెరిగిందన్నారు. ప్రతి గ్రామాన్ని సుందరీకరణ చేస్తామని, రోడ్లు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
