సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలునేడు, శుక్రవారం కూడా భారీగా పతనమయ్యాయి. నిన్న గురువారం భారీగా జరిగిన భారీ పతనం నెడు కూడా కొనసాగింది. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ ఇందుకు ప్రధాన కారణం. ముడి చమురు ధరల పెరుగుదల, చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనలు, ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపు యోచనలో ఉన్నారన్న వార్తలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల కాలపరిమితి ముగింపు కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. ఈ ప్రభావం రెండవ రోజు కూడా మన మార్కెట్లపై పడింది. దీంతో ప్రారంభంలోనే సెక్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,600 దిగువకు చేరింది. చివరకు రెండు ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,427.81 పాయింట్ల (క్రితం ముగింపు 81,691.98) వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,354.59 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 24,473.00 వద్ద కనిష్ఠాన్ని తాకిన నిఫ్టీ చివరకు 169పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.07 గా ఉంది.
