సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అరాచకపాలనకు పరాకాష్ఠ మాజీ మంత్రి అయ్యన్నను అరెస్టు చెయ్యడమేనని ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి జనం దృష్టి మరల్చడం జగన్ కు పరిపాటిగా మారిందన్నారు. వివేకానందరెడ్డి ని ఎవరు చంపారో షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐకి స్టేట్మెంట్ ఇవ్వడం, విశాఖలో భూ కబ్జాల వ్యవహరాలపై టీడీపీ పోరాడుతుండడంతో ఈ రెండు అంశాలపై నుంచి జనం దృష్టిని మరల్చేందుకే అయ్యన్నపై తప్పుడు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అయ్యన్న ఇంట్లోకి పోలీసులు దొంగల్లా రావడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం అయ్యన్నను చెప్పులు కూడా వేసుకోనియ్యకుండా లాక్కెళ్లారని, ఎదో రెండు సెంట్లలో అనుమతి లేకుండా ఇళ్లు కట్టారని,గోడ కట్టారని అయ్యన్నపై కేసు పెట్టి అరెస్టు చేస్తారా? . సీఐడీ వాళ్లు వైసీపీకి ఊడిగం చేస్తే మేం సైలెంట్‌గా ఉండాలా? అని మండిపడ్డారు. ‘అయ్యన్న కుటుంబంపై ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఇదేనా ప్రతిపక్ష నేతలను వేదించే పద్దతి అని విమర్శించారు.
