సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెండ్లికి అస్సలు ఇష్టపడరు. సమాజం కూడా చిన్నచూపు చూస్తుందని ఒక భావన.. అయితే ఇది పురుషులకు పెద్దగా వర్తించదు.. దేశంలో ఎక్కడలేని విధంగా అందుకే వితంతు మహిళలకు భరోసా కల్పించాలనుకుంటున్న వారు 2 వ పెళ్లి చేసుకొనేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతువులు ను ప్రోత్సహిస్తోంది. పెండ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్నీ, చనిపోయిన భర్త మరణధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే- వారి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమా చేస్తోంది. అయితే ఈ పత్రాలను పెండ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ మాత్రం ఈ పథకం వర్తించదు. మన ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అయిన ఎన్నికల మ్యానిపెస్టో లో పెట్టడానికి ఇదేదో కొత్తగా బాగానే కనిపిస్తుంది.. చుడండి మరి..
