సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై సీఎం వైఎస్ జగన్ నేడు, సోమవారం సమీక్ష నిర్వ హించారు. 2023–24ఆర్థిక సంవత్స రం మొదటి మూడునెలల్లోవిభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో జీఎస్టీ పన్నుల వసూళ్లు జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీపన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్లపెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్కు వివరించారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, ప్యూహాత్మకంగా ప్రజలను మద్యపానానికి దూరం చెయ్యడానికి మద్యం రేట్లు పెంచడం వల్ల ఆదాయంపెరిగిందని పేర్కొన్నారు.2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చి చూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులుతెలిపారు
