సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 19 వ తేదీ.. రేపటి గురువారం మధ్యాహ్నం 12.30 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భీమవరం పురాధీశ్వరి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాస జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ, నీరుల్లి కూరగాయ వర్తక సంఘం సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ అమ్మవారు నగర ఊరేగింపు తో జాతర మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.బాణాసంచా కాలుపులు, తీన్మార్ డప్పులు,రాష్ట్రంలో పేరు గాంచిన బేతాళ శక్తి వేశాల కళాకారులూ ప్రదర్శనలు తో కోలాటాలు తో, బుట్ట బొమ్మలతో జాతర నిర్వహించనున్నారు. ఎల్లుండి సాయంత్రం నుండి శ్రీ అమ్మవారి దేవాలయ ఆవరణలో అందమైన లైటింగ్ లతో జాతర సందడి మరింత పెరుగుతుంది.
