సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వంట గ్యాస్ కొరతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకరించారు. గల్ఫ్ యుద్ధ నీతిపద్యంలో హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదిన రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదిన చేరనున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అప్పటి వరకు సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటు న్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్ ను రేపటి సోమవారం నుంచి రేషన్ ద్వారా ఒకో రేషన్ కార్డు కు ఒకో లీటర్ చప్పున గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *