సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల నడుమ అలరారుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసిం హస్వామి తిరునాళ్లు సందర్భంగా ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు నరసాపురం మీదుగా వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీవో దాసి రాజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఈ నెల 28వ తేదీ కల్యాణం, 29న రధోత్సవం సందర్భంగా నరసాపురం మీదుగా పెద్ద సంఖ్యలో భక్తులు అంతర్వేది వెళుతుంటారు. వసిష్ఠ గోదావరి రేవులో పరిమితికి మించి ప్రయాణికులను పంటు ఎక్కించ రాదు. గజ ఈతగాళ్ల,పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంటు నడవాలి. అని ఆదేశించారు. ఆర్టీసీ డీఎం సుబ్బన్నరెడ్డి మాట్లాడుతూ 28, 29 తేదీల్లో భీమవరం,నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, డిపోల నుంచి ‘చించినాడ వంతెన’ మీదుగానే ఆర్టీసీ 40 సర్వీసులను రేయింబ వళ్లు గుడి వరకు నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ, రైల్వే, రేవుల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు.
