సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు దాటాక ఆలపాడు సమీపంలో కొల్లేటి సరస్సు మధ్యలో ఉన్న కొల్లేటి కోటలో దిబ్బపై శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు రేపు బుధవారం ప్రారంభము కానుంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి..9 అడుగుల మూలవిరాట్ శ్రీ పేదింట్లమ్మ విగ్రహం వందల ఏళ్లుగా చెక్కు చెదరక పోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు అమ్మ వారి జాతర నిర్వహిస్తున్నారు . జాతరలో తెలుగు రాష్ట్రాల నుండి ఒరిస్సా, కర్ణాటక నుండి కూడా విశేషంగా వేలాదిగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరు అయ్యి అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకొని అక్కడే విందులు చేసుకొన్నారు. . జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వర్ణేశ్వరుల కల్యాణం ఈనెల 28 శనివారం రాత్రి నిర్వహించనున్నారు.
