సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మార్చి 3,4 న జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ మార్చి 3,4 న పశ్చిమ గోదావరి జిల్లా లో పర్యటిస్తారని భీమవరం లో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ఒక ప్రకటనలో తెలిపారు. రేపు శుక్రవారం 3వ తేదీన ఉదయం 11 గంటల నుండి తాడేపల్లి గూడెం లో ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రారంభిస్తారని తదుపరి సాయంత్రం నరసాపురంలో పర్యటిస్తారని తెలగా కళ్యాణ మండపంలో సమావేశం తదుపరి రాత్రికి భీమవరం లో బస చేస్తారని తెలిపారు. ఎల్లుండి 4వ తేదీ శనివారం ఉదయం 9:30 గ.లకు భీమవరంలో నిర్మల దేవి ఫంక్షన్ హాల్ నందు పశ్చిమ గోదావరి జిల్లాలో నియోజకవర్గ ఇంఛార్జి లకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు,మండల అధ్యక్షులకు, మరియు భీమవరం & ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశము నిర్వహిస్తున్నామని కావున పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నియోజవర్గాల ఇంఛార్జి లు,జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, ZPTC లు, ఎంపీటీసి లు, వార్డ్ మెంబర్లు,’జనసేన’ క్యాడర్ అందరూ తప్పక హాజరు కావాలని పిలుపు నిచ్చారు.
