సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కు వెళ్లే భక్తులు కు రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెలకు సంబంధించి దర్శన టికెట్లను విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పొందడానికి టికెట్స్ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు.. ఇక 21వ తేదీ మధ్యహ్నం 12 గంటల నుంచి 23వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో టికెట్లు పొందిన భక్తులు వాటిని ఆన్‌లైన్ విధానంలో డబ్బు చెల్లించి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది. అటు ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *