సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తీసుకు వచ్చిన స్త్రీ శక్తి పథకం విజయవంతమైంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలతో పాటు తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది అని ప్రకటించారు. . ఈ పథకాన్ని రేపు అంటే బుధవారం.. ఉగాది పండగ కానుకగా సీఎం చంద్రబాబు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొనున్నారు.
