సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్న భీమవరం గునుపూడి లోని సోమారామం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి నందు రేపటి నుండి మహాశివరాత్రి కళ్యామహోత్సవములు సందర్భముగా ఏర్పాట్లను నేడు, గురువారం ఐజీ, అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ, అద్వాన్ సయిం అస్మిన్, ముందుగా శ్రీ స్వామి వారిని ఆలయ మర్యాదలతో ప్రదక్షణం చేసుకొని దర్శనం చేసుకొన్నారు. తదుపరి రేపటి శుక్రవారం నుండి 5 రోజుల పాటు జరిగే శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు కు ప్రతి రోజు వేలాది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి స్థానిక సీఐ నాగరాజు తదితర పోలీస్ అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేసారు. ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జాము 3 గంటల నుండి వేలాది భక్తుల కు ఎటువంటి అసౌకర్యం లేకుండా త్వరితంగా శ్రీ స్వామివారి దర్సనం జరిగేందుకు దేవాలయ కార్యనిర్వాహణ అధికారి డి రామకృష్ణంరాజు తో చర్చించారు. 16వ తేదీ మధ్యాహ్నం రధోత్సవం, 17వ తేదీ రాత్రి తెప్పోత్సవం రోజులలో అనుసరించవలసిన ప్యూహాత్మక ఏర్పాట్లను, వేడుకల నేపథ్యంలో దూరప్రాంతాల భక్తుల వాహనాల, బస్సు ల పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *