సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రతిష్టాకరమైన ఆక్వా ఎక్స్ పో ఎగ్జిబిషన్ రేపటి నుండి పెద్దమిరం , రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు ఆక్వా ఎక్స్పో పో బ్రోచర్ విడుదల చేసారు. మన ప్రాంత ఆక్వా వ్యవసాయం చేసే రైతు, సోదరులు,ఎగుమతి దిగుమతి దారులు, ఆక్వా అనుబంధ వ్యాపారులు అందరు రేపటి శుక్రవారం నుండి ప్రారంభిస్తున్న ఆక్వా ఎక్స్ పో కు వచ్చి నూతన వ్యవసాయ ఆక్వా సాగు, ఫీడ్స్ వివరాలు..నిపుణులతో సమీక్షలు , ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నా ఆధునిక పద్ధతులు అవగాహన కు బాటలు వేసుకొవాలని పిలుపునిచ్చారు.
