సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరీ శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో రేపటి గురువారం నుండి అంటే ఈ అక్టోబర్ నెల17వ తేదీ గురువారం 04:30 ని||ల నుండి 04:45 మధ్య, కలశస్థాపన, అమ్మవారికి దీక్షా మాలా సమర్పణ, భక్తులతో మండల దీక్ష ప్రారంభం.కానుంది. 40 రోజుల పాటు మండల దీక్ష పాటించే భక్తులకు మాల ధారణ ప్రధాన అర్చకుల నేతృత్వంలో శ్రీ అమ్మవారి సమక్షంలో నిర్వహించబడుతుంది . అర్ధ మండల దీక్ష 20 రోజులు చేసే భక్తులకు వచ్చే నవంబర్ 6వ తేదీ బుధవారం ఉదయం 5గంటలకు మాల ధారణ చేస్తామని, నవంబర్ 16న శనివారం ఉదయం 6 గంటలకు పాద మండల దీక్ష ఇస్తామని తదుపరి నవంబర్ 27న దీక్ష విరమణ పూర్ణాహుతి యాగం ఉదయం 9. 30 కి జరుగుతుందని, తదుపరి శ్రీ అమ్మవారికి నెయ్యి అభిషేకం జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మాలధారణ లపై ఆసక్తి గల భక్తులు వివరాల కోసం ముందుగా దేవాలయం కార్యాలయంలో సంప్రదించాలి.
