సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో ఇటీవల నిత్యా కళ్యాణం పచ్చ తోరణం తరహాలో శ్రీఅమ్మవారి ప్రాశస్యం తెలుగు రాష్ట్రాలలో మరింత విస్తరించేలా ప్రతి రోజు ఎదో ఒక ఆధ్యాత్మిక కార్యాక్రమం జరుగుతుండటం దేవాలయం భక్తుల సందడితో మంచి జోష్ లో ఉండటం సర్వసాధారణం గా జరుగుతుంది. రేపటి శుక్రవారం నుండి ( ఆగస్టు 8 వ తేదీ నుండి 10 వ తేదీ ఆదివారం వరకు )నిర్వహించనున్న లక్ష గాజులు అలంకరణ కు, వందలాది మహిళలు నుండి…అనూహ్య స్పందన వచ్చింది.. వివిధ ప్రాంతాలు నుండి పెద్ద ఎత్తున వచ్చిన మహిళా భక్తులు గాజులను అలంకరణకు వీలుగా మాలలుగా తయారు చేసే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారని., అంతేకాక.. శోభాయమానం గా అలంకరణ చేయబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దేవస్థానం మండపం లో ఏర్పాటు చేయనున్నామని, శ్రావణ మాసంలో ఈ శుక్రవారం సాయంత్రం సంధ్యాకాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం శనివారం ( శ్రావణ మాసం మహాలక్ష్మి ప్రీతి కరమైన మాసం. శ్రవణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరునక్షత్రం, శనివారం మహా విష్ణు ప్రీతికరమైన వారం ) మరియు ఆదివారం సూర్య నారాయణ ప్రీతికరమైన వారం., అందుచేత ఈ మూడురోజులు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని సకల శుభాలు పొందాలని దేవస్థానం ప్రధాన అర్చకులు. బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ,దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.
