సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయం రేపు గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి చేతులమీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో భీమవరంలో బీజేపీ క్యాడర్ ప్రధాన సెంటర్స్ లో కట్టిన ఫ్లక్సీ ల సందడి కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ క్యాడర్ స్థానిక జేపీ రోడ్డులో ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి భారీ బైక్ ర్యాలీ కి సన్నాహాలు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీకి బరిలో దిగే ఉద్దేశ్యం ఉన్న బీజేపీ పార్టీ తన ఎన్నికల శంఖారావం ను రేపు భీమవరం నుండే పూరించనుంది, రేపు శ్రీమతి పురంధరేశ్వరి జిల్లా బీజేపీ కీలక నేతలు క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సోమువీర్రాజు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పాకసత్యనారాయణ వంటి రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు.
