సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో స్థానిక భీమవరం అంబేద్కర్ చౌక్ నందు రేపు మంగళవారం ఉదయం 9 గంటలకు స్వచ్ఛత భాగిదారి కార్యక్రమం లో భాగంగా మానవ హారం & స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించబడును. ఈ కార్యక్రమమునకు నర్సాపురం లోక్ సభ సభ్యులు మరియు కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ,రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేన్ రాజు ఎమ్మెల్యే అంజిబాబు , మరియు జిల్లా కలెక్టర్ C. నాగరాణి IAS, జాయింట్ కలెక్టర్,T. రాహూల్ కుమార్ రెడ్డి IAS, ఇతర జిల్లా స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొంటారని, ప్రజా ప్రతినిదులు ప్రజలుపెద్ద ఎత్తున హాజరు అయ్యి విజయవంతం చెయ్యాలని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
