సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో ( మన సిగ్మా వెబ్ ఛానెల్ ఆఫీస్ వద్ద) సుమారు 150 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన మహిమ కలిగిన ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి సంబర మహోత్సవం మహర్నవమి సందర్భముగా రేపు మంగళవారం నిర్వహిస్తున్నారు. సుమారు శతాబ్దం కాలంగా కాలం మారుతున్నా.. ప్రతి ఏడాది ఆచారం ప్రకారం ఇక్కడ నిప్పుల గుండం ఏర్పాటు చేసి భక్తులు త్రొక్కడం హైలైట్.. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి కర్ణి భక్తులు ఆధ్వర్యంలో మహర్నవమి రోజు సంబరం నిర్వహిస్తూనే ఉంటారు. రేపటి ఉదయం నుండి భక్తుల కోలాహలం ఉంటుంది. రేపు రాత్రి 7గంటల నుండి శ్రీ స్వామివారికి మేళతాళాలతో , మంటలతో శూలాలతో వీర శైవ నృచాలు ,డప్పు వాయిద్యాలతో, బుట్టబొమ్మలా, ప్రభల కోలాహంతో సంబరం నిర్వహించారు. తమ సమస్యలు, కష్టాలు గట్టెక్కాలని కోరుకొంటూ ఇక్కడ ఉదయం నుండి ఉపవాస నిష్ఠ తో ఉన్న భక్తులు రేపటి రాత్రి 10 గంటలకు ఏర్పాటు చేసే నిప్పుల గుండంలో భక్తులు ‘అసారభ అసారభ అంటూ నిప్పులను త్రొక్కవచ్చు.. తదుపరి నంది వాహనం ఎక్కి కాగడాలతో,మేళతాళాలతో ,ప్రభలు వెంటరాగా డప్పు వాయిద్యాలతో స్వామివారు నగర సంచారం చేయి తెల్లవారు జామున దేవాలయం కు తిరిగి రావడంతో సంబరం ముగుస్తుంది.అందరు ఆహ్వానితులే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *