సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నవరాత్రుల వేడుకలు పూర్తీ చేస్తున్న గణేష్ ప్రతిమల నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందరి కళ్ళు హైదరాబాద్ లోని రేపు శనివారం నిర్వాహించనున్న మహా నిమజ్జనం పైనే. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar)లోతు 25 అడుగుల మట్టి పూడిక తీయించడంతో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌లు, మెడికల్‌ క్యాంపులు, మొబైల్‌ టాయిలెట్లు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే 1.25 లక్షల విగ్రహాలు (చిన్నవి, పెద్దవి) నిమజ్జనమైనట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. అన్నిటికన్నా అతికిలకం.. ఖైరతాబాద్‌(Khairatabad)లోని విశ్వశాంతి మహాశక్తి 68 అడుగుల మహా గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో రేపు కూడా మధ్యాహ్న 1.30 గంటల వరకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు బాలాపూర్‌ గణపతి కూడా సాయంత్రం లోపు సాగర తీరానికి చేరేలా చర్యలుతీసుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *