సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు గురువారం ఉదయం 6 గంటలకు భీమవరం DNR కళాశాల గ్రౌండ్ లో ప్రతిష్టాకరంగా జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను నేడు, బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, నర్సాపురం సబ్ కలెక్టర్ దాసిరాజు, భీమవరం ఆర్.డి.ఒ. ప్రవీణ్ కుమార్ రెడ్డి, DNR కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణ రాజు(బాబు) ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు తదితరులు స్టేజి, గ్రీన్ మ్యాట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు ఉదయం భీమవరం లోని దాదాపు అన్ని విద్య సంస్థల నుండి వేలాదిగా విద్యార్థులు ప్రజలు, ప్రజా ప్రతినిదులు , జిల్లా అధికారులు , ‘యోగ’ చెయ్యడానికి, ఆసనాలు వెయ్యడానికి తరలి రానున్నారు. వారికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
