సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి నారాలోకేశ్ తెలిపారు. ఉదయం 11గంటలకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చును . కాగా,ఫలితాలతో పాటు మార్క్ మెమోలను సైతం విద్యార్ధులకు వాట్స్ ప్ ద్వారా పంపనున్నట్లు ఇంటర్ అధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్‌లో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా bieap.gov. in అధికారిక వెబ్సైట్లో సులభంగా తెలుసుకొనే అవకాశం ఉంది.
