సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు కు ఎట్టకేలకు అనేక ట్విస్ట్ ల తరువాత నేటి ఆదివారం ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బి పారంను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చెయ్యడంతో ఆయన మరోసారి అధికారికంగా నామినేషన్ వెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు.. రేపు , సోమవారం. ఉ. 10.30 లకు భీమవరం శివారు లోని ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదమిరం తన నివాసం నుండి ర్యాలీగా బయలు దేరి ఉండి MRO ఆఫీస్.నందు టీడీపీ బి పారంతో కలపి నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో విశేషంగా కూటమి క్యాడర్ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి ఆశీస్సులు,అందజేయాలని కోరారు. ప్రస్తుత టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు తో కలసి రామలక్ష్మణ లుగా కలసి ఎన్నికలలో పోరాడతామని, ఆయనతో నేటి సాయంత్రం సమావేశం ఉందని రేపు నా నామినేషన్ కు ఆహ్వానిస్తానని కలసి వెళతామని టీడీపీ పార్టీలోని క్యాడర్ అందరు అనుకోని పరిస్థితులను అర్ధం చేసుకొని పెద్ద మనస్సుతో సహకరించాలని ఎంపీ రఘురామా విజ్ఞప్తి చేసారు. జనసేన అధినేత పవన్ కూడా నేడు, రేపు ఎల్లుండి ఉదయం భీమవరం లో అందుబాటులో ఉండటం మరో ఆసక్తి పరిణామం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *