సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కలియుగ వైకుంఠం గా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు సోమవారం ఏప్రిల్ నెల సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కాగా.. నేడు (ఆదివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 77,856 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది,
