సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కొన్ని బ్యాంకులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిరంతరాయంగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ (All India Bank Employees Association) రేపు (నవంబర్ 19, శనివారం) సమ్మె పిలుపునిచ్చింది. ఈ ప్రభావం ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది. ఇందులో బ్యాంకు ఆఫీసర్ల భాగస్వామ్యం లేకపోయినప్పటికీ సమ్మె తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం వినియోగదారుల నగదు డిపాజిట్లు, ఉపసంహరణ, చెక్కుల క్లియరెన్స్ వంటి కార్యకలాపాలకు అంతరాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ఎప్పటిలాగానే సాధారణ కార్యకలాపాలు కొనసాగనున్నప్పటికీ.. బ్రాంచులు, ఆఫీస్‌లకు సంబంధించిన కొన్ని సెక్షన్ల ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉండడంతో కొంతమేర ప్రభావం పడే సూచనలున్నాయని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది.
