సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : రేపు శుక్రవారం భీమవరం పట్టణంలో కూరగాయలు , పండ్లు అమ్మకాలు జరగవని, దుకాణాలు మూసివేయడం జరుగుతుందని, స్థానిక నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ప్రకటించింది. శ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు ముగింపుగా నీరుల్లి కూరగాయలు పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో రేపు శుక్రవారం ఉదయం నుండి భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు అందరు శ్రీ అమ్మవారి భక్తుల సేవలో పనిచేస్తారు. కాబ్బటి దుకాణాలు మూసివేస్తారు. స్థానికులు గమనించగలరు.
