సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి మంగళవారం (ఈనెల 24 వ తేదీ) ఉదయం నుండి భీమవరం పట్టణం మెంటే వారి తోటలోని శ్రీ సుందరయ్య భవనం ( సిపిఎం భవనం) లో గుండె సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. ప్రముఖ పిల్లల వైద్యులు పాల్గొని చిన్నారులకు 2డి ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించి తగిన వైద్య సహకారం అందిస్తారని చేస్తారన్నారు .ఈ అవకాశం ను పట్టణ ప్రజలు చిన్నారుల తల్లి తండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
