సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్నికల వేడి రాజుకొంది. ఎల్లుండి అంటే ఈనెల 25 లోగ నామినేషన్స్ పక్రియ కూడా పూర్తీ కావస్తుంది. అభ్యర్థులు అందరు దాదాపుగా నామినేషన్స్ వెయ్యడం కూడా పూర్తీ కావస్తుంది. ఈ నేపథ్యంలో భీమవరం లో జనసేన పార్టీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు రేపు బుధవారం ఉదయం నామినేషన్స్ వెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నేతలతో కలసి, క్యాడర్ తో సహా ఊరేగింపుగా వెళ్లి ఆర్ డి ఓ కార్యాలయంలో నామినేషన్ వెయ్యనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని కూటమి శ్రేణులకు అంజిబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. పులపర్తి అంజిబాబు నేటి మంగళవారం సాయంత్రం వీరవాసరం మండలంలో కమతాలపల్లి, మత్స్యపురి పాలెం,బాలేపల్లి, నందమూరిగరువు, పెరికిపాలెంగ్రామాలలో విస్తృతంగా తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామా పెద్దలను, ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు.
