సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు లోకకళ్యాణార్థం శ్రీ స్వామివార్కి ది.15-06-2023వ తేదీ అనగా రేపు గురువారం ఉదయం గం.07-00లకు సహస్రఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించబడును. కావున యావన్మంది భక్తులు విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ ప్రసాదములు స్వీకరించవలసినదిగా ఆలయం ధర్మకర్తల మండలి ఛైర్మన్, కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తలు కుర్మదాసు సత్య శ్రీనివాస్, నాచు శ్రీవల్లి,లక్కు త్రిమూర్తులు,నల్లం రఘుబాబు,చల్లబోయిన సూర్యప్రకాష్ రావు, కోయ తాతాజీ, సోమాదుల లీలా ఈశ్వరీ, తాణాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయం కార్యనిర్వహణాధికారి సి.హెచ్.సురేష్ నాయుడు తెలియజేసారు
