సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. నేడు సోమవారం కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనిస్తుంది. దానితో ఆంధ్ర ప్రదేశ్ తీరా ప్రాంతంలో అన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా పెనుగాలులు వీస్తున్నాయి. ఈ తుపాను రేపు, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది అని, ప్రజలు అప్రమత్తంగాఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *