సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల (SSC Results) విడుదలకు రేపు శనివారం .. రంగం సిద్ధం అయింది. . ఈ నెల 6న (శనివారం) ఉదయం 11గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ‘10’ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయం గా ఈ విషయాన్న తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను https://www.results.bse.ap.gov.in/
(https://www.results.bse.ap.gov.in/) వెబ్ సైట్ లలో
చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6లక్షల 50 వేల మందికి పైగా విద్యార్థులు రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *