సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వస్తిశ్రీ చాంధ్రమాన శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి రేపు గురువారం అనగా ది 14.03 .2024 తేదీన న భరణి నక్షత్రము నందు భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి లక్ష పుష్పార్చన కార్యక్రమం దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ నేత్రుత్వములో, దేవస్థానం ధర్మకర్తలు మండలి సహకారం ఆధ్వర్యంలో ఉదయం గం 7.00 లకు ప్రారంభిoచి ముందుగా శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పూజ, శ్రీ అమ్మవారికి అభిషేకం తదనంతరం లక్ష పుష్పార్చన చేయుటకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని, శ్రీ అమ్మవారికి అర్చన చేసిన పుష్పాలు, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి తరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ శ్రీ మానేపల్లి నాగేశ్వరావు కోరారు.నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న విజయవాడకు చెందిన భక్తులు కలిదిండి సూర్యనారాయరాజు అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కలిదిండి కృష్ణంరాజు 25116/-( ఇరవై ఐదువేల నూట పదహారు రూపాయలు )దేవాలయంలో భక్తులకు నిర్వహించే శ్రీ మావుళ్ళమ్మవారి నిత్య అన్నసమారాధన కు కానుకగా సమర్పించారు.
