సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ సీఎం పదవి చేపట్టబోతున్న కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి వైసీపీ లో అత్యంత కీలకనేత ఎం పీ విజయసాయిరెడ్డి, ట్విటర్ లో తాజాగా నేడు, బుధవారం శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్‌ను తన పార్లమెంట్ సభ్యుడిగా సహోదరుడుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణాలో జెడ్పీ టీసీ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి రేవంత్‌రెడ్డి ఎదిగారని, ఇది ఎంతో కష్టసాధ్యమని అయిన రేవంత్ చేసిన కృషిని అభినందించారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీలను, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు విజయసాయి ట్వీట్ చేసారు.
