సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) నేడు, గురువారం పలుమారులు పెద్ద సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ సభ్యులకు అధికార మంత్రులకు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య ఉద్రిక్త వాతావరణంచోటుచేసుకుంది. మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర చర్చ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినట్లురా యలసీమ ప్రజలు ప్రయోజనాల కోసం గత జగన్ సీఎంగా ఉన్నపుడు ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతుండగా.. ‘తన’ విజ్ఞప్తి ఫై ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేశారని బహిరంగంగా చేప్పారని, ఇది రాయలసీమ ప్రజలకు కూటమి సర్కార్ చేసిన ద్రోహంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు ఎక్కడుందని ‘బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు’ అని మంత్రి తీవ్రంగా విమర్శించారు.మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..‘వైసీపీ వాళ్ళు ప్రశ్న వేసి రాజకీయాలు చేయడం ఏమిటి?’ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులునిలిపివేయాలని 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలుఇచ్చిందని . 2023లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం మంచినీటి కోసమేనని ఆనాటి ప్రభుత్వం చెప్పింది.‘కేవలంగుంతలు తవ్వి రూ.900 కోట్లు నిధులు తీసుకున్నారు.తల్లికి కోక పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్టు జగన్ పరిస్థితి ఉంది’ అని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో పరిస్థితి అదుపుతప్పడంతో ఛైర్మన్, సభను వాయిదా వేశారు.సభ తిరిగి ప్రారంభం అయ్యాక తర్వాతి కొత్త ప్రశ్న లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ మంత్రులపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను మూడోసారి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *