సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బెంగళూర్ నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన అరెస్టులపై సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ నేడు, మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ.. సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని తెలిపారు. వీరిలో తెలుగువారు ఎక్కువమంది ఉన్నారని . ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సీపీ తెలిపారు. ఈ పార్టీలో ఒక నటి, ప్రముఖులు ఉన్నారని.. వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని సీపీ అన్నారు. 18 లగ్జరీ కార్లు సీజ్ చేశామని, పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని.. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు. వీరిలో 30 మంది మహిళలు ఉన్నారు. అందులో 25 మంది యువతులు ఉన్నారు. ఇక ఈ పార్టీలో 45 గ్రాములు MDMA, కోకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని అంతేకాదు.. డ్రగ్స్ దొరక్కుండా నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. స్విమ్మింగ్ పూల్స్ లో కొంత కలిపేశారని, , ప్రహరీ వెలుపల పడేశారన్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా డ్రగ్స్‌ని గుర్తించామని చెప్పారు సీపీ. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశామని.. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందని సీపీ దయానంద్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *