సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో అర్హత లేనివారికి, మరియు అదనపు రేషన్‌కార్డులు ఏరివేతలో భాగంగా రేషన్‌కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్‌ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. పలు కారణాలతో ఇంకా కొందరు ప్రజలు. తో పాటు పలు చోట్ల వారి కుటుంబంలోని 5 సంవత్సరాలు దాటిన పిల్లల ఈ కేవైసీని పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి కోసం ప్రభుత్వం మరోసారి ఈ కేవైసీనీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని స్థానిక రేషన్ డీలర్స్ వద్ద లేదా ఆన్ లైన్ లో పూర్తి చెయ్యవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *