సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో గతంలో 2న్నర ఏళ్ల పాటు కరోనా సమయంలోను కూడా ప్రభుత్వ రేషన్ లో ఇచ్చే సరకులు తక్కువైన ఎంతో సమర్ధవంతంగా బియ్యం , పంచదార, కందిపప్పు పంపిణి చేసేవారు.కొన్ని నెలలుగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు మాత్రమే రాయితీపై గోధుమపిండి అందిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా మాత్రం కందిపప్పు విషయం లో ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది. గత ఏడాదిగా కార్డుదారులు నాణ్యత తక్కువని భావించి కందిపప్పు తీసుకోక పొడవడం వల్లే రేషన్ డీలర్స్ ఆసక్తి చేపడంలేదని, పైగా రేషన్ డీలర్స్ వద్ద కందిపప్పు పాత స్టాక్ ఉండిపోయి వారు దానికి కొత్త డిపాజిట్స్ కట్టడం లేదని ప్రచారం జరిగింది. కార్డు దారుడు అడగాలి కానీ ఒక్కో కార్డుపై 2 కేజీలైనా కందిపప్పు ఇచ్చే యోచనలో ఉన్నామని ఆ శాఖ మంత్రి కారుమూరి, ఇటీవల ప్రకటించారు. కానీ ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాల ఆపరేటర్లు మాత్రం అసలు కందిపప్పు సరఫరానే లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.170 వరకూ పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై కేజీ రూ.67కే అందిస్తున్న రేషన్‌ కందిపప్పు కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ ఆగస్టులో రేషన్‌ సరుకుల పంపిణీ 15వ తేదీతో పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 1,46,14,045 కార్డులు ఉండగా.. వాటిలో 1,24,35,690 కార్డులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. అంటే 85శాతం మంది కార్డుదారులకు బియ్యం అందాయి. కానీ రాయితీ కందిపప్పు మాత్రం కేవలం 4,29,445 కార్డులపై ఇచ్చినట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.దీనిపై పౌరసరఫరా శాఖ మంత్రి , కారుమూరి నాగేశ్వర రావు రాయితీలో నాణ్యమైన కందిపప్పు పంపిణి ఫై దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *