సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ఇంటింటికి వచ్చి ప్రజలకు రేషన్ అందించే రేషన్ వాహనాలను రద్దు చేసింది. మంత్రి మనోహర్ ఇప్పటికే దీనిపై వచ్చే జూన్ 1 నుండి రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నట్లు, ప్రజలు వారికీ కావలసిన రేషన్ సరుకులు వారి వార్డుకు కేటాయించిన రేషన్ డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలని ప్రకటించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8వేల పైగా వాహనాలను ఏర్పాటు చేసిన.. అది రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాలలో బ్లాక్ మార్కెట్ కు తరలించడానికి ఉపయోగపడిందే తప్ప ప్రజలకు మేలు చెయ్యలేదని ఆ వాహనాలు కోసం వేచి చూసి సమయం వృధా చేసుకొనేవారని విమర్శించారు. మరి ఆ ప్రభుత్వ రేషన్ వాహనాలను ఏమి చేస్తారో ? ఆ వేలాది ఉద్యోగులకు డ్రైవర్స్ కు ఉపాధిపై ఎటువంటి హామీ ప్రకటించలేదు. ఇదిలా ఉండగా..మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా పూర్తీ స్థాయిలో సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు నేడు, బుధవారం హర్షం ప్రకటించారు. డీలర్స్ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అంటూ cmచంద్రబాబుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
