సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరాయ చర్యలు చేపట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పిలుపు ఇచ్చారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో వారు మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో మూడు విడతలుగా రూ 20 వేలను పెట్టుబడి సాయంగా జమ చేయడం జరిగిందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఆధారిత పంటలు, సన్న రకాలను పండించాలని సూచించారు. మన జిల్లాలో పండించేది ఎక్కువగా ఎగుమతికి వెళ్తుందని, స్థానిక ప్రజలు వినియోగించే రైతులను మాత్రమే పండించాలని సూచించారు. రైతులు సాంకేతికను అందిపుచ్చుకుని పెట్టుబడిని తగ్గించుకోవాలని, డ్రోన్ వినియోగంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని అన్నారు. ప్రభుత్వం 6 రోజులపాటు రైతన్న నీకోసం కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్దేశించిందని, 16,17,18, 23,24,25 తేదీలలో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రైతు ప్రయోజనాలను, వ్యవసాయంలో సాంకేతికత జోడింపు, పంట మార్పిడి ప్రయోజనాలు, రైతు యాప్ ప్రయోజనాలు, తదితర అంశాలపై రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. అనంతరం రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *