సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం.. జనసేన, బీజేపీ బలపరిచిన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణ రాజు ప్రచారం ఉదృతం చేసారు. ప్రచారంలో తారసపడ్డ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. దుంపగడప, మందపాడు ,చేరుకుమిల్లి, అయి భీమవరం, కాళ్ళ కోడు, అజ్జమూరు తదితర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసారు. ఉండి టీడీపీ కంచుకోట అని.. పార్టీ కష్టకాలం లో కూడా ఇక్కడి ప్రజలు టీడీపీ అండగా ఉంటారని నిరూపించారని , అయితే ఈ సారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని అందుకే ఎప్పటి లానే ఉండి ప్రజలు ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని, యువత ఇష్టపడే జనసేన, బీజేపీ పెద్దలు లు కూడా అండగా నిలబడతారని ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్ధించారు. ఎంపీ రఘురామా ను గెలిపించాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు భార్య, కుమారుడు, కుమార్తె కూడా ఉండి నియోజకవర్గంలో వాడవాడలా ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం గమనార్హం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *