సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, బుధవారం గుంటూరు లోని మిర్చి రైతులను పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వేలాదిగా వైసీపీ, కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేసారు. గుంటూరు పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు పైన కూడా జగన్ ను వీక్షించడానికి అభిమానులతో నిండిపోయాయి. రోడ్లు జనసంద్రం అయ్యాయి. మిర్చి రైతులను పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ రైతుల సమస్యలు వినడానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వలేదని పోలీసులు లేకుండా చేసి తనకు సెక్యూరిటీ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ అయిన భయపడేది లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా దోపిడీ, రైతుల పధకాలు ఎగవేత తప్ప, రైతుకు ఏ పంటకు కనీసం మద్దతు ధర లేదని, మిర్చి రైతుల పరిస్థితి మరి అధ్వానంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో, పంట విత్తనాల కొనుగోలు నుండి చెప్పిన సమయానికి పండిన పంటకుఅత్యధిక మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నామని చెప్పారు. ఇప్పుడు రైతు సమస్యలపై మాట్లాడటానికి వస్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ‘‘తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది ఆరోజు చంద్రబాబుకి కనీసం సెక్యూరిటీ లేకుండా చేస్తాం.సచివాలయానికి మిర్చి యార్డ్‌కు ఎంత దూరం ఉందిరైతుల కష్టాలు కనీసం కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని కూడా గుంటూరు పర్యటనలో పాల్గొన్నారు.
