సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలోని చాట్రాయి, గ్రామంలో గత రబీ సీజన్‌లో 2022 మే నెల లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా 80 మంది రైతులను రూ. 2 కోట్ల పైగా మోసం చేసాడని రైతులు ఆరోపిస్తున్న ధాన్యం వ్యాపారి బొడంపూడి కిషోర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో చాట్రాయి రామాలయం వద్ద బాధిత రైతులు మూడు రోజుల నిరసన దీక్ష చేపట్టారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, జిల్లా బాద్యుడు కృష్ణ చైతన్య, జిల్లా కన్వీనర్‌ రాయంకుల లక్ష్మణరావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్‌ బత్తుల వెంకటేశ్వరావు మాట్లాడుతూ .. వ్యాపారి బొడంపూడి కిషోర్‌ రైతుల నుండి ధాన్యం, మెక్కజొన్న కొనుగోలు చేసి గత నవంబరు నెల ఇస్తామని చెప్పి సొమ్ము ఇవ్వకుండా కాలయాపన చేసి తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయామని గ్రహించిన బాధిత రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇప్పించకపోతే రేపు 6వ తేదీన స్థానికచాట్రాయి పోలీస్‌ స్టేషన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *