సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నేడు, శనివారం ఎన్నో కార్యక్రమాలలో అలుపుసొలుపూ లేకుండా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆకివీడు మండలంలోని కళింగ గూడెం గ్రామంలో 27.80 లక్షల రూపాయలు, రాజుల పేట గ్రామంలో 29.94 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన “రైతు సేవా కేంద్రం” భవనాల ప్రారంభోత్సవము చేసారు. తదుపరి, కాళ్ళ మండలం, పెద అమిరం గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఇకపైఉండిలోని ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్లతో పాటు ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా రఘురామ తెలిపారు. ఆకివీడు మండలం, సిద్దాపురం గ్రామంలో జరిగిన “కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ఉచిత పంపిణీ కార్యక్రమం” లో పాల్గొని రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు రఘురామకృష్ణ రాజు స్వయంగా పంపిణీ చేశారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన సంక్రాంతి సంబరాలల్తో పాల్గొన్నారు. తెలుగు పాప్ గాయని స్మిత , గాయకుడూ నోయల్ తో ఆటాపాటా లో పాల్గొనడమే కాదు.. స్మిత రూపొందించిన ‘భీమవరం సంక్రాంతి’ పాటలో అతిధి పాత్రలో స్టెప్స్ కూడా వేశానని ప్రకటించి విద్యార్థులను యువతను ఉత్సహపరిచారు.
